*ఎంఐజి కాలనీలో ఉన్న మంచి నీటి సంపు పై కప్పు, కాంపౌండ్ వాల్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలి. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు సరఫరా అందించాలి…… CPM…..ఆదోని.*…..
ఆదోని పట్టణంలో MIG కాలనీలో ఉన్న మంచి నీటి స్టోరేజీ సంపు పై కప్పు భాగంలో మరమ్మతులు చేపట్టి,కాంపౌండ్ వాల్( రక్షణ గోడ) నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలి, ప్రజలకు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని *సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న,సీనియర్ నాయకులు ఈరన్న, పట్టణ నాయకులు,తిప్పన్న*, తెలిపారు. ఎమ్ఐ జి కాలనీలో ట్యాంకు దగ్గర ఉన్న సంపును సిపిఎం నాయకులు పరిశీలించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ ఆదోని పట్టణ మున్సిపాలిటీ లక్షలాది రూపాయలు మంచి నీటి కోసం వెచ్చించి రంజాల దగ్గర నీటిని ఫిల్టర్ చేస్తూ సంపులకు సరఫరా చేస్తున్నారు. అయితే ఎం ఐ జి లో ఉన్న సంపు కు పైభాగము సగం మరమ్మతులకు నోచుకోక ఓపెన్ గా ఉండటంతో చుట్టుపక్కల పిల్లలు ఆడుకుంటూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇప్పటికే *పెద్ద హరివాణం గ్రామంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రక్షణ గోడ లేకపోవడంతో నిన్నటిదినం ఇద్దరు చిన్నారులు మృతి చెందారని వారు గుర్తు చేశారు.* ఇలాంటి సంఘటన ఆదోని పట్టణంలో జరగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందని వారు తెలిపారు. ప్రధానంగా సంపు పైభాగం ఓపెన్ గా ఉండటం వల్ల రాంజాల దగ్గర ఫిల్టర్ చేసిన నీరు ఇక్కడికి చేరినప్పటికీ ఇందులో దుమ్ము, ధూళి, అలాగే కోతులు, కుక్కలు, పందులు, పక్షులు లాంటివి సంపులో పడే అవకాశం ఉంది.ఈ నీటినే ట్యాంకు కు ఎక్కిస్తూ వార్డులకు సరఫరా చేస్తున్నారు. ఈ మంచినీటిని ప్రజలు తాగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ గా ఉన్నాయి. సంబంధిత అధికారులు నిత్యం ఈ ట్యాంక్ దగ్గరికి వస్తున్నప్పటికీ దీన్ని గమనించి మరమ్మతులు చేపట్టకపోవడం చాలా దురదృష్ట కరం అని వారు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సంపుకు మరుమ్మతులు చేపట్టాలి, రక్షణ కూడా నిర్మించి, ప్రజల ప్రాణాలు కాపాడాలి, ప్రజలకు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, మంచినీరు సరఫరా చేయాలని వారు తెలిపారు. లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేయగలమని వారు తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!