యుటిఎఫ్ ఆదోని ఉపాధ్యాయ ఉద్యమనేత దివంగత చెన్నుపాటి లక్ష్మయ్య జీవితం ఆదర్శనీయమని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి టి.గాదిలింగప్ప పేర్కొన్నారు. శనివారం ఆదోని పట్టణంలోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన చెన్నుపాటి లక్ష్మయ్య 55 వ సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ సీనియర్ నాయకులు వి పాపయ్య , కే రుద్రముని గార్లు చెన్నుపాటి లక్ష్మయ్య గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టీ గాదిలింగప్ప గారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిని అంకితభావంతో నిర్వహించి ఉపాధ్యాయుల సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేశారని సంఘ నిర్మాణంలో, కార్యకర్తల్ని తయారు చేసుకోవటంలో, నాయకత్వం వహించటంలో ఆయన ఎన్నో సుసాంప్రదాయాల్ని నెలకొల్పారు. సమైక్య ప్రజాసంఘంగా వివిధాభిప్రాయాలు గల వారిని ఇముడ్చుకొని, వన్నెలూ, చిన్నెలూ దిద్దుకొని పనిచేసేవారని పేర్కొన్నారు. సమావేశంలో యూటీఎఫ్జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ జి శ్రీనివాసులు, ఆడిట్ కమిటీ సభ్యులు యం.మల్లికార్జున, వై రామాంజనేయులు యుటిఎఫ్ నాయకులు వై.నారాయణ, జనార్ధన్, రాజాహుసేన్, ఎ బసప్ప, ఒ.రంగన్న, పి.రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!