నంద్యాల జిల్లా:రుద్రవరం మండలంలోని ఎల్లా వత్తుల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న రుద్రవరం గ్రామానికి చెందిన బాల గుర్రప్ప ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఎల్లా వత్తులలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థుల లను ఆదర్శంగా తీర్చిదిద్దడం, వారిని విద్యలో ముందుకు తీసుకువెళ్లడం, పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విద్యాభివృద్ధికి కృషి చేసిన బాల గుర్రప్ప సేవలు గుర్తించిన జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు. మంగళవారం నంద్యాలలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయనకు ఉత్తమ ఉపాధ్యాయుడు ప్రశంస పత్రంతో పాటు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన బాల గుర్రప్పను పలువురు నాయకులు గ్రామస్తులు, అధికారులు, అభినందించారు.
[zombify_post]


