in ,

ఆళ్ళగడ్డ లోఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

నంద్యాల జిల్లా: ఆళ్ళగడ్డలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఆళ్ళగడ్డ నియోజకవర్గ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యులకు సభ్యత్వ కిట్ల పంపిణీ, రక్తదాన శిబిరం, పారిశుద్ధ కార్మికులకు మరియు భవన నిర్మాణ కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి, అభిమానులతో ర్యాలీగా వెళ్లి నాలుగు రోడ్ల సర్కిల్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారికి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మైలేరి మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీకి పనిచేస్తున్న క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాదంలో గాయపడితే 50 వేల రూపాయలు మరియు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించారని  దేశంలో ఏ పార్టీ కూడా కార్యకర్తల కోసం ఇంత పెద్ద మొత్తం ఇన్సూరెన్స్ కల్పించలేదని తెలియజేశారు.  బైక్ ర్యాలీనీ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పోలీసులతో బలవంతంగా అమల్లో లేని సెక్షన్ 30 ఉందని పోలీసులతో చెప్పించి కార్యక్రమాలను అడుగడుగునా  అడ్డుకున్నారని అయినా జనసైనికులు ర్యాలీగా వెళ్లి మహాత్మా గాంధీ గారికి అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించామని తెలియజేశారు. వైసీపీ నాయకుల అరాచకాలను అరికట్టాలంటే 2024లో వైసీపీ అభ్యర్థులను ఓడించాలని రాక్షస పాలనను  అంతం చేయాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించే బాధ్యత జనసైనికులు  తీసుకోవాలని పిలుపునిచ్చారు. జనసేన అభ్యర్థులను గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా జనసైనికులు జనసేన పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు మైలారు శ్రీరాములు, వెంకటసుబ్బయ్య, నరేంద్ర యాదవ్, మహబూబ్ దౌల, దూదేకుల బాబు, జమాల్ బాషా, సురేంద్ర, కుమార్ ,మహబూబ్ బాషా, మద్దిలేటి యాదవ్,  ఆంజనేయులు, రామాచారి, గుర్రప్ప, రాజారాం, కేశవ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

అక్క ను చంపింది చెల్లెనే..!

విశాఖ -లింగంపల్లి, విశాఖ – తిరుపతి రైళ్లు రద్దు