నంద్యాల జిల్లా : ఆళ్లగడ్డ పట్టణంలో ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ గణేష్ ఉత్సవ కేంద్ర సమితి గౌరవాధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త TMC వేణుగోపాల్ తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లపై కేంద్ర సమితి సభ్యులతో సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పట్టణంలోని 40 కి పైగా కూడళ్లలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారని కేంద్ర సమితి నిర్ణయం మేరకు ప్రతి ఒక్క కమిటీ వారు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందన్నారు. ఈనెల 18న గణేష్ విగ్రహాల ప్రతిష్ట పూజా కార్యక్రమాలు, ఈనెల 22 న నిమజ్జనం ఉంటాయని వేణుగోపాల్ తెలిపారు. టౌన్ లోని అన్ని వినాయక కమిటీ బృందాలు ప్రశాంత వాతావరణంలో ఈ ఏడాది ఉత్సవాలను జరుపుకునేందుకు సహకరించాలని మీటింగ్లో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు బి. నీలకంఠేశ్వరం, జి తిరుపాల్ రెడ్డి, సోముల శ్రీనివాసరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]


