ఆదోని మున్సిపాలిటీ 25వ వార్డు లో వై నీడ్ జగన్ ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే శ్రీ వై సాయిప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 25వార్డు కౌన్సిలర్ కృష్ణవేణి అధ్యక్షతన వార్డు ఇంచార్జీలు జికె రాజు, సిద్ధ.మల్లిఖార్జున ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి బోయ శాంతమ్మ, వైస్ చైర్మన్ బి.నరశింహులు ,జెసియస్ టౌన్ కన్వీనర్ వెల్లాల మధుసూదనశర్మ, ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చైర్మన్ శాంతమ్మ, వైస్ చైర్మన్ బి నరశింహులు , మధుసూదనశర్మ మాట్లాడుతూ రాష్ట్రములో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అమ్మ ఒడి, వసతి దీవన, పొదుపు మహిళలకు ఋణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న చేనేత కార్మికులకు, 45సంవత్సరములు నిండిన మహిళలకు జగనన్న ఆసరా,జగనన్న గోరుముద్ద, కులవృత్తులకు జగనన్న తోడు,ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని శాంతమ్మ, మధుసూదనశర్మ, నరశింహులు , మధుసూదనశర్మ తెలిపారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటి పట్టాలు, డిట్కో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి ఇల్ల పంపిణీ చేయడమే కాకుండా 2008 సంవత్సరములో 2100వేలవంద రూపాయలు డిడి కట్టిన వారందరికీ జగనన్న ప్రభుత్వం వచ్ఛాక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకటిన్నర సెంటు స్థలాలు పంపిణీ చేయడం జరుగుతోందని, పేదబడుగు బలహీన, వర్గాలకు మరియు ఎస్సీ ఎస్టీ మైనారిటీ లకు జగనన్న పాదయాత్రలో మాట ఇచ్ఛిన ప్రకారంగా నవరత్నాలు అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారని కనుక, పేదబడుగు బలహీన వర్గాలు, బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి ని చేసుకోవాలంటే రాబోయే 2024 ఎన్నికల్లో గెలిపించుకుని రాష్ట్రాభివృద్ధికి, పేదవాడి కుటుబాల అభివృద్ధి మీ అందరి సహాయ సహకారాలు రాబోయే ఎన్నికల్లో ఆదోనిలో సాయిప్రసాద్ రెడ్డి గారికి అందించాలని వారు కోరారు. అనంతరం 25వ వార్డుకు సంక్షేమ పథకాల ద్వారా అందిన వివరాల అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి అనుపమ గారు, వివరించి, సంక్షేమ పథక వివరాలతో కూడిన బోర్డును, చైర్మన్ శాంతమ్మ, వైఎస్సార్ పార్టీ జికె రాజు, మల్లిఖార్జున , టౌన్ కన్వీనర్ వెల్లాల మధుసూదనశర్మ తో కలిసి ఆవిష్కరణ చేసారు. అనంతరం చైర్మన్ శ్రీమతి బోయ శాంతమ, కౌన్సిలర్ కృష్ణవేణి, వైస్ చైర్మన్ బి.నరశింహులు, మధుసూదనశర్మ ,జికె రాజు,సిద్ధ మల్లిఖార్జున, వైఎస్సార్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కన్వీనర్లు గోవిందరాజు, రాఘవేంద్ర, మల్లిఖార్జున, శివ, నరరశింహ, అంజి,లాలప్ప, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!