ఆదోని మున్సిపాలిటీ 21వ వార్డు లో వై నీడ్ జగన్ ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే శ్రీ వై సాయిప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 21వార్డు కౌన్సిలర్ లక్ష్మీ దేవమ్మ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి బోయ శాంతమ్మ, జెసియస్ టౌన్ కన్వీనర్ వెల్లాల మధుసూదనశర్మ, వార్డు ఇంచార్జి చంద్రశేఖర్ రెడ్డి గారు ,ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు,ఈ సందర్భంగా చైర్మన్ శాంతమ్మ, ఇంచార్జి చంద్రశేఖర్ రెడ్డి ,మధుసూదనశర్మ మాట్లాడుతూ రాష్ట్రములో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అమ్మ ఒడి,,వసతి దీవన, పొదుపు మహిళలకు ఋణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ,జగనన్న చేనేత కార్మికులకు, 45 సంవత్సరములు నిండిన మహిళలకు జగనన్న ఆసరా,జగనన్న గోరుముద్ద, కులవృత్తులకు జగనన్న తోడు,ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని శాంతమ్మ, మధుసూదనశర్మ, చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటి పట్టాలు,డిట్కో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి ఇల్ల పంపిణీ చేయడమే కాకుండా 2008 సంవత్సరములో 2100వేలవంద రూపాయలు డిడి కట్టిన వారందరికీ జగనన్న ప్రభుత్వం వచ్ఛాక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకటిన్నర సెంటు స్థలాలు పంపిణీ చేయడం జరుగుతోందని, పేదబడుగు బలహీన, వర్గాలకు మరియు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జగనన్న పాదయాత్రలో మాట ఇచ్ఛిన ప్రకారంగా నవరత్నాలు అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారని కనుక,పేదబడుగు బలహీన వర్గాలు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి ని చేసుకోవాలంటే రాబోయే 2024 ఎన్నికల్లో గెలిపించుకుని రాష్ట్రాభివృద్ధికి, పేదవాడి కుటుబాల అభివృద్ధి మీ అందరి సహాయ సహకారాలు రాబోయే ఎన్నికల్లో ఆదోనిలో సాయిప్రసాద్ రెడ్డి గారికి అందించాలని వారు కోరారు. అనంతరం వార్డు అడ్మిన్, 21వార్డుకు సంక్షేమ పథకాల ద్వారా అందిన వివరాలను రవి కుమార్ వివరించి, సంక్షేమ పథక వివరాలతో కూడిన బోర్డును, చైర్మన్ శాంతమ్మ, వార్డు కౌన్సిలర్ లక్ష్మీ దేవమ్మ, టౌన్ కన్వీనర్ వెల్లాల మధుసూదనశర్మ, వార్డు ఇంచార్జి చంద్రశేఖర్ రెడ్డి మరియు మున్సిపల్ డిఈ నాగభూషణం రెడ్డి తో కలిసి ఆవిష్కరణ చేసారు. అనంతరం చైర్మన్ శ్రీమతి బోయ శాంతమ్మ, లక్ష్మీ దేవమ్మ మరియు చంద్రశేఖర్ రెడ్డి, మధుసూదనశర్మ వైఎస్సార్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కన్వీనర్లు చిన్న గౌడ్, రంగస్వామి, లక్ష్మన్న, రఫీక్, లలిత,రేఖమ్మ, సురేష్, మంజునాథ్, నవీన్ కుమార్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!