ఆదోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు..
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి ముగ్గురి మునిసిపల్ మేనేజర్ భాస్కర్ రెడ్డి, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు మహాలక్ష్మి, చరణ్ పై కేసు నమోదు చేశారు.
అవినీతి శాఖ డి.ఎస్.పి వెంకటాద్రి తెలిపిన వివరాల మేరకు ఆదోనిలో అంబెడ్కర్ నగర్లో ఉన్న ఆది ఆంధ్ర మున్సిపల్ స్కూల్ లో టీచర్ గా పని చేసిన శ్రీనివాసులు గత 30 నెలల క్రితం సస్పెండ్ అయ్యారు. ఈ కాలానికి సంబంధించిన నాన్ డ్రాయల్ సర్టిఫికెట్ కోసం బాధితుడు మున్సిపల్ మీనేజర్ ని సంప్రదించారు. అయితే మరో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ ల ద్వారా ₹ 30 వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని శ్రీనివాస్ ఆ సమయంలో అంత మొత్తం లేదని ₹ 5000 అడ్వాన్స్ గా ఇచ్చాడు. మిగిలింది విడతల వారిగా ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే విషయంపై ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి పథకం ప్రకారం సోమవారం రెండవ విడతగా ₹ 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి , జూనియర్ అసిస్టెంట్ లు మహాలక్ష్మి , కృష్ణ చరణ్ ఉన్నారు. ఈ ముగ్గురిపై కేసు నాడు చేశామని పూర్తి విచారణ చేసి మరిన్ని వివరాలు తెలుపుతాని అవినీతి శాఖ డి.ఎస్.పి వెంకటాద్రి తెలిపారు.
This post was created with our nice and easy submission form. Create your post!