in ,

AP SI exam: ఎస్సై తుది రాతపరీక్ష ప్రాథమిక కీ విడుదల..

AP SI exam: ఎస్సై తుది రాతపరీక్ష ప్రాథమిక కీ విడుదల..

అమరావతి: ఏపీలో ఎస్సై ఉద్యోగాల తుది రాతపరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శని, ఆదివారాల్లో విశాఖ, గుంటూరు, ఏలూరు, కర్నూలు నగరాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే..

మొత్తంగా ఈ పరీక్షలు రాసేందుకు 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించగా శనివారం (అక్టోబర్‌ 14) జరిగిన పేపర్‌-1 (ఇంగ్లిష్‌), పేపర్‌-2 (తెలుగు) పరీక్షలకు 30,585 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండో రోజైన ఆదివారం (అక్టోబర్‌ 15) జరిగిన పేపర్‌-3 (అరిథ్‌మెటిక్‌, మెంటల్‌ ఎబిలిటీ) పరీక్షకు 30,569 మంది, పేపర్‌-4(జనరల్‌ స్టడీస్‌) పరీక్షకు 30,560 మంది హాజరయ్యారు. పేపర్‌-3, 4 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ప్రాథమిక కీలను ఏపీ ఎస్‌ఎల్‌పీఆర్‌బీ(APSLPRB) విడుదల చేసింది. సమాధానాలపై అభ్యంతరాలను అక్టోబర్‌ 18 సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత ఫార్మాట్‌లో slprbap.obj@gmail.comకు మెయిల్‌లో పంపాలని సూచించింది. అనంతరం తుది కీతో పాటు ఫలితాలు వెలువరించనున్నారు. ప్రశ్నా పత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో https://slprb.ap.gov.in/ అందుబాటులో ఉంచారు..

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

*UPI Payments:త్వరలో ‘హలో! యూపీఐ’..మీ సొంత భాషలోనే అందుబాటులోకి.

కాంగ్రెస్ మాట – దామోదరం సంజీవయ్య బాట.