in , , ,

హైదరాబాద్‌-బెంగళూరు వందేభారత్‌.. ఈనెల 24న ప్రారంభం

ఈ నెల 24న పలు మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు ప్రారంభంకానున్నాయి. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ మార్గంలో నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. దాంతో పాటు కొత్తగా విజయవాడ – చెన్నై రూట్‌లోనూ రైలు పట్టాలెక్కనున్నది.  ఈ రైలు సోమవారం నుంచి కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. మహబూబ్‌నగర్‌, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. తిరిగి యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 2:45 గంట‌ల‌కు బయల్దేరి.. రాత్రి 11:15 గంట‌ల‌కు కాచిగూడ చేరుకుంటుంది.

ఉదయం విజయవాడలో 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటల వరకు చెన్నైకి చేరుతుంది. తిరిగి అక్కడి నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుంది. ప్రస్తుతం విజయవాడ – చెన్నై మధ్య ఇంటర్‌ సిటీ పినాకిని ఎక్స్‌ప్రెస్‌ నడుస్తున్నది.

హైదరాబాద్-బెంగళూరు మధ్య వందేభారత్‌ ప్రారంభమైతే ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య అత్యంత వేగంగా రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బెంగళూరు నుంచి 10 గంటల్లో హైదరాబాద్ చేరుకుంటుంది.

Report

What do you think?

Written by Naga

చంద్రబాబు అక్రమ అరెస్టుకు చర్లలో నిరసనగా భారీ ర్యాలీ

నాన్ అమృత్…. నీలినీడలు!”