మహారాణిపేట : చదువులో వెనుకబడి పీఎంపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కరకం గ్రామానికి చెందిన మీసాల రమ్య (16) విశాఖలో బోయిపాలెం ఎన్‌ఆర్‌ఐ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది.ఆమెతో పాటు మేనత్త కూతురు కూడా అదే కాలేజీలో చదువుతోంది. ఈమెతో పాటు ఇతర విద్యార్థుల కన్నా రమ్య చదువులో వెనుకబడింది. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే దొండపర్తి రామాలయం వద్ద నివసిస్తున్న దల్లి రాజేష్ ఈనెల 4న ఆత్మహత్యకు పాల్పడినట్టు నాల్గో పట్టణ పోలీసులు తెలిపారు. జీవితం మీద విరక్తి చెంది చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. నగరంలో సరాసరి రెండు రోజులకు ఒక ఆత్మహత్య కేసు నమోదు అవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కమిషనరేట్ పరిధిలో చిన్నచిన్న కారణాలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబ సమస్య గాని, విద్యాపరమైన సమస్య గాని, ఆఫీసులో సమస్య వల్ల కానీ ఇటీవల ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాగే మానసిక అనారోగ్యం గలవారు, మాదక ద్రవ్యాలకు బానిస అయిన వారు, లైంగిక హింసకు గురైన వారు, ఉద్రేకం, దూకుడు స్వభావం కలిగిన వారు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది ఆత్మహత్యల ద్వారా నిండు జీవితాన్ని ముగించుకుంటున్నారని ఒక అంచనా. వీటిలో నాల్గో వంతు భారత దేశంలోనే జరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి.
చిన్నచిన్న కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధితులు
నేడు ప్రపంచ ఆత్మహత్యా నివారణ దినం
మానసిక వైద్యుడే మందు..
అత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వారు మానసిక వైద్యుడిని కలిసేలా ప్రోత్సహించాలి. వారు బాధితుల సమస్య తెలుసుకుని వారి ప్రయత్నాన్ని నివారించగలుగుతారు. ఆత్మహత్య ఆలోచనలు పదేపదే వస్తున్నప్పుడు కౌన్సెలింగ్, మందుల ద్వారా నయం చేయడానికి వీలు ఉంది. ఆత్మహత్య లేదా దిగులు వంటి లక్షణాలను గుర్తించడం, ఆత్మహత్య కోసం లేదా చావుల కోసం పదేపదే ప్రస్తావించే వారి పట్ల ప్రత్యే శ్రద్ధ చూపాలి. ఇలాంటి వారిని ఒంటరిగా వదలకపోవడం మంచిది.
– డాక్టర్ కారెడ్రి వెంకట రామిరెడ్డి
సూపరింటెండెంట్, ప్రభుత్వ మానసిక వైద్యశాల, విశాఖపట్నం
[zombify_post]


