పాలకొండ: రానున్న ఎన్నికల్లో వైసీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలప డం ఖాయమని టీడీపీ పాలకొండ నియోజకవర్గ పరిశీలకుడు కలమట సాగర్, నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ అన్నారు. పట్టణంలోని మెయిన్ రోడ్డులో టీడీపీ శ్రేణులతో కలిసి గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కక్షపూరితం గానే పసలేని కేసులతో చంద్రబాబును అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దీక్షలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, పట్టణ అధ్యక్షుడు గంటా సంతోష్, మండల అధ్యక్షుడు గండి రామినాయుడు, నాయకులు బల్లా హరి, వెన్నపు శ్రీనివాసరావు, కిమిడి కాశింనాయుడు, సుంకరి అనీల్‌దత్, జాడ శ్రీధర్, సిరిపు రం బుజ్జి, తంగుడు శ్రీనివాసరావు, చింతా ఉమామహేశ్వరరావు, అంపోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్టు అక్రమం
టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేశా రని అరకు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు వారాడ సుమంత్ నాయుడు, రాష్ట్ర రైతు సంఘ ఉపాధ్యక్షుడు ఖండాపు వెంకటరమణ మూర్తి, ఎంపీపీ సామంతుల దామోదరరావు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్ర బాబు అరెస్టుకు నిరసనగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో టీడీపీ నాయకులు పడాల భూదేవి, గుమ్మిడి సింహా ద్రి, సవర మాలయ్య, సవర కుంపి, ఆరిక లక్షుమయ్య, బిడ్డిక దమయంతి నా యుడు, పైల సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు.
 
			
			 
					