in , , ,

వైద్య కళాశాల ప్రారంభోత్సవ శిలాఫలకంపై స్థానిక కార్పొరేటర్‌గా ఉన్న తన పేరును ఎందుకు చేర్చలేదని,

వైద్య కళాశాల ప్రారంభోత్సవ శిలాఫలకంపై స్థానిక కార్పొరేటర్‌గా ఉన్న తన పేరును ఎందుకు చేర్చలేదని, ప్రొటోకాల్‌ పాటించకుండా అత్యుత్సాహం చూపిన అధికారుల తీరుపై కోర్టుకు వెళ్తానని 49వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ కర్రోతు రాధమణి హెచ్చరించారు. వైద్య కళాశాల ప్రాంగణంలో ఆమె టీడీపీ నేతలతో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు. వివక్ష చూపడం స్వార్థం కాదా అంటూ ఎమ్మెల్యే కోలగట్లను ప్రశ్నించారు. 2021లో శంఖుస్థాపన చేసిన శిలాఫలకంపై తన పేరుందని, ప్రారంభోత్సవానికి తాను కార్పొరేటర్‌ను కాకుండా పోయానా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష కార్పొరేటర్‌గా ఉన్నప్పటికీ తన పేరును ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. పాలకులు ఎలా చెబితే అధికారులు అలా చేస్తున్నారని, అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అధికారులు అనుసరిస్తున్నారో లేదో అర్థం కావడం లేదన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం శిలాఫలకంలో పేరుచేర్చాలని.. లేకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని, అక్కడ న్యాయం జరగకుంటే న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్రోతు నర్సింగ్‌రావు, గడిశ్రీను, నడిపిల్లి ప్రసాద్‌, సైలాడ శంకరావు, మద్దిల ప్రవీణ్‌, దుక్క పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

అక్రమాలకు చెక్‌ పడేనా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే చంద్రబాబు అక్రమ అరెస్ట్”