in , , , ,

లోకేష్ ఢిల్లీ పర్యటనపై స్పష్టత ఇచ్చిన ఎంపీ రామ్మోహన్ నాయుడు*

లోకేష్ గారి ఢిల్లీ పర్యటనపై స్పష్టత ఇచ్చిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

టీడీపీ పార్లమెంటరీ మీటింగ్ లోకేష్ అధ్యక్షత వహించినున్నట్లు వెల్లడి

ఓటమి భయంతోనే జగన్ దారుణాలకు పాల్పడుతున్నారు

 ఢిల్లీ: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రస్తావించనున్నట్లు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనికి సంబంధించి జరగనున్న పార్టీ పార్లమెంటరీ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షత వహించినున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు లోకేష్ ఢిల్లీ పర్యటనపై స్పష్టతనిస్తూ.. ఆయన జాతీయ మీడియాతో శుక్రవారం మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ప్రతిపక్షాలపై అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారిని ను లేనిపోని కేసులతో అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజా కోర్టులో వైసీపీకి తగిన పరాభవం తప్పదని హెచ్చరించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ఆ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్నే అడగండి: అచ్చెన్నాయుడు”

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్