రామన్నపేట లో వజ్రాల గుట్ట ఉందని తెలుసుకొని ప్రజలు వజ్రాల వేట కోసం బల్లకట్టుపై ప్రాణాల్ని ప్రణంగా పెట్టి వజ్రాలు దొరికితే రాత్రికి రాత్రి రాజు అవుతామని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బల్లకట్టుపై వందల సంఖ్యలో వజ్రాల వేట కోసం గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాల నుండి భారీగా తరలివస్తున్న జనం
గుంటూరు జిల్లా పుట్లగూడెం నుండి ఈ బల్ల కట్టపై ఎన్టీఆర్ జిల్లా రామన్నపేట కు వందల సంఖ్యలో జనాన్ని ఎక్కించుకొని బల్లకట్టు నిర్వహకులు ఎటువంటి రక్షణ జాకెట్లు లేకుండానే గాలిలో దీపం లాగా బల్లకట్టు నిర్వహిస్తున్నారు.
ఇంతమంది జనం రావడానికి కారణం :
గత రెండు వారాల క్రితం గుంటూరు జిల్లా వాసి కి ఒక వజ్రం దొరికిందని సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వైరలైన సంఘటన ఆ వజ్రం 70 లక్షల నుండి కోటి రూపాయలు లోపు పలికిందని ఆరోపణలు వినిపించాయి.
ఇకనైనా ప్రభుత్వం ఈ బల్లకట్టుపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.


