in , ,

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు

మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మాచర్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు మాచర్ల పట్టణంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు దుర్గారావు ఆధ్వర్యంలో మాచర్ల ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు పోలీసులు టిడిపి నాయకులను అక్కడ నుంచి బలవంతంగా పంపించి వేశారు. రెంటచింతల మండల కేంద్రంలో మాచర్ల గుంటూరు ప్రధాన రహదారిపై రెంటుచింతల మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి మాజీ ఎంపీపీ గొంటు సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కారంపూడి మండల కేంద్రంలో జిల్లా నాయకులు పంగులూరి అంజయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు

[zombify_post]

Report

What do you think?

Written by Radhakrishna

ఎస్ కే బి ఆర్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి పూర్వపు విద్యార్థుల సహకారం

చంద్రబాబు అరెస్టు లో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు: హోంమంత్రి తానేటి వనిత