- మందస గ్రామంలో కొత్త వీధికి చెందిన ఆలయ పూజారి రాము కలియ (23) మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాము కలియ మందస దరి కంచుమాయమ్మ ఆలయ పూజారిగా జీవనం కొనసాగిస్తూన్నాడు. మేనమామ కున్ని కలియ ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాము కలియ తల్లిదండ్రులు ఇరువురు మృతి చెందడంతో మానసికంగా కృంగిపోయి మధ్యానికి బానిస అయ్యాడు.ఈ నేపథ్యంలో 1వ తేదీ నుండి కనిపించకుండాపోయాడు. 3వ తేదీన కంచుమాయమ్మ ఆలయ సమీపంలో గల మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పలువురు భావిస్తున్నారు. మందస పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేగింది.
[zombify_post]


