చంద్రబాబు బెయిల్‌పై ఈ రోజు ఒకే సారి రెండు కోర్టుల్లో విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టు ఈ నెల 10న జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ.. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పైనా హైకోర్టు విచారణ జరపనుంది. చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పైనా ఈ రోజు ఏసీబీ కోర్టులో వాదనలు జరగనున్నాయి. మరో వైపు, రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి.. సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పైనా విచారణ జరగనుంది.


