శిరివెళ్ల, న్యూస్ : టిడిపి అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సిఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో శుక్రవారం హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ గోగిశెట్టి నరసింహారావు, ఆయన కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పార్టీలో కి చేరారు. పార్టీలోకి చేరిన వారికి చంద్రబాబు నాయుడు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు._
_అంతకు ముందు శిరివెళ్ల మండల పరిధిలోని వీరారెడ్డి పల్లె గ్రామం నుండి గోగిశెట్టి నరసింహారావు, ఆయన అభిమానులు, కార్యకర్తలు,మాజీ సర్పంచులు, మాజీ శాసనసభ్యులు నాయకులతో భారీ ఎత్తున 400 వాహనాలలో వేల జనాభాతో బనగానపల్లె లోని గాలి సుబ్బారెడ్డి ఫంక్షన్ హాల్ కు బయలుదేరి వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు._
_పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలు అన్ని రంగాల్లో రాణించేలా తాను భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో టిడిపి హయంలోనే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందిందని చెప్పారు. వైసిపి కుళ్లూ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని, వైసిపి ఆగడాలు ఇక సాగవన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రభుత్వం పై తిరగబడ దానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీలోకి చేరిన వారిలో వారి సర్పంచులు, మాజీ జడ్పిటిసిలు, నాయకులు, వారి అభిమానులు ఉన్నారు._
[zombify_post]

