[ad_1]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడుతో ములాకాత్ అనంతరం బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం రెండు పార్టీలు కలిసి పని చేసే సమన్వయ కమిటీని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా సమన్వయ కమిటీ తొలి సమావేశం ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ భేటీలో రోడ్ మ్యాప్ రూపొందించి, జనసేన, టీడీపీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
[ad_2]


