in , , , ,

చంద్రబాబు నాయుడ్ని విడుదల చేయ్యాలంటూ జాలెం సుబ్బరావు ఆమరణ నిరాహారదీక్ష

మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ పి గన్నవరం నియోజకవర్గం నగరం గ్రామంలో జాలెం సుబ్బారావు ఆదివారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. తొలుత బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షలో కూర్చున్న జాలెం సుబ్బారావు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడ్ని విడుదల చేసే వరకూ  విరమించేదిలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలు మానుకోవాలని జాలెం అన్నారు. 

భారత రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఆమరణ నిరాహారదీక్షలోనున్న జాలెం సుబ్బారావును  పి గన్నవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు..

[zombify_post]

Report

What do you think?

Written by Aruntez

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేశ్”

రెచ్చిపోతున్న పేకాట ఆటగాళ్లు”