in , , ,

కోనసీమలోకి ప్రవేశించనున్న యువగళం పాదయాత్ర

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నర్సాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో జనం బ్రహ్మరథం పట్టారు. యువగళం పాదయాత్ర 207వరోజు సీతారాంపురం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర నర్సాపురంలోకి ప్రవేశించగానే పట్టణ ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. అడుగడగునా మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీసి హారతులతో నీరాజనాలు పట్టారు. యువనేతకు సంఘీభావంగా పెద్దఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చారు. లోకేష్ ను కలిసి ఫోటోలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు. భవనాలపై నిలబడి యువనేతకు అభివాదం చేశారు. భోజనవిరామానంతరం చినమామిడిపల్లి వద్ద పాలకొల్లు నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువనేత లోకేష్ కు వేలాది ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో కొబ్బరికాయల గజమాలతో యువనేతను సత్కరించారు. లోకేష్ ను స్వాగతిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు, మహిళలు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేసిన యువనేత… టిడిపి అధికారంలోకి వచ్చాక చేపట్టే సంక్షేమ పథకాలను వివరించారు. సరిపల్లిలో అగ్నికుల క్షత్రియులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. 207వరోజు యువనేత లోకేష్ 18.5 కి.మీ.లు పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2836.9 కి.మీ.లు పూర్తయింది. శుక్రవారం సాయంత్రం యువగళం పాదయాత్ర పాలకొల్లు నియోజకవర్గంలో పూర్తిచేసుకొని కోనసీమలోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2836.9 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 18.5 కి.మీ.*

*208వరోజు (8-9-2023) యువగళం వివరాలు*

*రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి తూర్పుగోదారి జిల్లా)*

సాయంత్రం

3.00 – కలగంపూడి క్యాంప్ సైట్ లో శెట్టిబలిజ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

4.00 – కలగంపూడి నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.45 – చించినాడలో స్థానికులతో సమావేశం.

5.45 – పాదయాత్ర రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

6.00 – దిండిలో స్థానికులతో సమావేశం.

7.30 – శివకోటిలో రైతులతో సమావేశం.

9.00 – రాజోలు ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.

10.15 – సోంపల్లిలో స్థానికులతో సమావేశం.

10.30 – పొదలాడలో స్థానికులతో సమావేశం.

10.40 – పొదలాడ శుభం గ్రాండ్ వద్ద విడిది కేంద్రంలో బస.

[zombify_post]

Report

What do you think?

Written by Aruntez

గిరిజన తండాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు

మొక్కజొన్న పంటను వేసి ..పూర్తిగా నష్ట పోయిన పోయిన రైతన్నలు..