ఏసియుసిఏ యూత్ కమిటీ ఆదోని పట్టణ సెక్రెటరీగా సుమంత్
ఆదోని క్రిస్టియన్స్ యునైటెడ్ చర్చెస్ అసోసియేషన్ (ఏసీ యూసీఏ) యూత్ కమిటీ ఆదోని పట్టణ సెక్రటరీగా ఏసుక్రీస్తు ప్రార్థన మందిరం యూత్ సభ్యులు మాధవరం సుమంత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏసీయూసీఏ ఆదోని పట్టణ అధ్యక్షులు ఆనంద్ రాజ్, కార్యదర్శి ఎజ్రా శ్రీధర్, ట్రెజరర్ తామస్ లు తెలిపారు గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన యూత్ కమిటీ సభ్యుల సమావేశం ఏసియుసిఏ ఆదోని పట్టణ అధ్యక్షులు ఆనంద్ రాజ్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆదోని క్రిస్టియన్ యునైటెడ్ చర్చస్ అసోసియేషన్( ఏసీ యూసీఏ ) అనుబంధంగా దాదాపు 13 సబ్ కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుంది అని అందులో భాగంగా యూత్ కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు యూత్ కమిటీకి అన్ని విధాలుగా అర్హులైన విద్యావంతుడు సత్ప్రవర్తన కలిగిన మాధవరం సుమంత్ ను ఏసీయూసీఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదంతో యూత్ కమిటీ ఆదోని పట్టణ సెక్రెటరీగా ఎన్నుకోవడం జరిగిందన్నారు అనంతరం యూత్ కమిటీ ఆదోని పట్టణ సెక్రెటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాధవరం సుమంత్ ను పూలమాలవేసి సత్కరించారు ఈ సమావేశంలో ఏసీ యూసీఏ ఆదోని పట్టణ గౌరవ అధ్యక్షులు పాస్టర్ ఆల్బర్ట్, అధ్యక్షులు పాస్టర్ ఆనంద్ రాజ్, కార్యదర్శి పాస్టర్ బేతపూడి ఎజ్రా శ్రీధర్, ట్రెజరర్ థామస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాస్టర్ ఎమ్ ఎస్ రావు, యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!