డెంకాడ మండలం జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్ కళాశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా 56వ ఇంజినీర్ల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన త్వరణ సాఫ్ట్వేర్ | సొల్యూషన్స్ ఈకామర్స్ డిపార్ట్మెంట్ టీమ్ లీడ్ కన్సల్టెంట్ వి.స్వాతి మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ ప్రతిభ దేశ పురోగతికి దోహదపడిందన్నారు. ఇంజినీరింగ్ రంగంలో మార్పులు గమనిస్తూ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రిన్సిపల్ వి. వి. రామారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఎక్స్పోలో విద్యార్థుల నూతన ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. అనంతరం వారికి క్విజ్, పేపర్ ప్రెజెంటేషన్, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ముఖ్యఅతిథి స్వాతిని సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు టి.హరిబాబు, కె.వి.నర్సింహం, సమన్వయకర్త బి. శ్రీధర్, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
[zombify_post]


