in , ,

ఆంధ్రాలోనే కాదు అమెరికాలో నిరసన తెలిపినా సరే శిక్ష పక్కా: మంత్రి గుడివాడ అమర్నాథ్”

 తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై, ఏపీ పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా బ్రిటన్ లో, అమెరికాలో ఆందోళనలు చేసిన కూడా చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన పేర్కొన్నారు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నిందితుడిగా దొరికాడని అందుకే చట్టం ఆయనను జైలుకు పంపించిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా తప్పించుకోలేరని, చట్టం ముందు అందరూ సమానమేనని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం కానీ, పార్టీల ప్రమేయం కానీ ఉండదని, చంద్రబాబు పట్టుబడ్డాడు కాబట్టి చంద్రబాబును పోలీసులు రిమాండ్ కు తరలించారని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.

 చంద్రబాబు చేసిన తప్పులలో ఒకటి మాత్రమే బయటపడిందని చెప్పిన ఆయన ఇంకా బయటపడనివి చాలా ఉన్నాయని, అవి కూడా త్వరలోనే బయటపడతాయని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన అవినీతి గురించి ప్రజలకు తెలిసిపోయిందని, దీంతో రాష్ట్ర ప్రజలు జన్మలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయరని మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిందేనని మంత్రి ఎద్దేవా చేశారు

 చంద్రబాబు కోసం లోకేష్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్న మంత్రి గుడివాడ అమర్నాథ్, తండ్రి కోసం కొడుకు అమెరికాకు వెళ్ళినా కూడా ప్రజలు నమ్మరని, చంద్రబాబు శిక్ష అనుభవించి తీరుతాడు అని స్పష్టం చేశారు. తప్పు చేసిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు తెలపడం దుర్మార్గమని పేర్కొన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీని అవినీతి పూరిత పార్టీగా మారిందని గుడివాడ అమర్నాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రజలకు మంచి చేస్తున్నానని గొప్పలు చెప్పుకున్న బాబు అవినీతి బయటపడిందని ఆయన ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన తోపాటు ఇతర పార్టీలు కలిసి పోటీ చేసినా వైసిపి విజయాన్ని ఆపలేవని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. 2024 సంవత్సరంలో ఏపీలో వైసిపి మరోమారు అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ మరోమారు సీఎం కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

కొందరు రాజకీయాల్లో చౌకబారుగా నటిస్తున్నారు: వెంకయ్య- పాచిపోయిన లడ్డూపై రివెంజ్*

చంద్రబాబు నాయుడు బయటికి రావాలని మొక్కులు తీర్చిన కార్యకర్తలు….