in ,

నేడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతి

*నేడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతి*

*భరతమాత విముక్తికై ప్రాణాలు అర్పించిన మహానీయుల త్యాగఫలం అమర హై అమర హై ఇన్ క్లబ్ జిందాబాద్*

*యువతకు మార్గదర్శలైన యువ కిషోరాలు సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుకుదేవుల 93వ వర్ధంతి*

ఆదోని న్యూస్ :- సర్దార్ భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా 104 బస్సాపురం గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం సిపిఐ గ్రామ కార్యదర్శి కరెంటు ఈరన్న అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావి రాజుగారు పాల్గొని   యువతకు సందేశాత్మక విషయాలను తెలియజేశారు. దేశం కోసం ప్రాణ త్యాగాలను సైతం లెక్కచేయకుండా దేశం ఉనికి కోసం పోరాటాలు బలిదానాల వల్ల సాధించుకున్న స్వాతంత్రాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం స్వతంత్ర ఫలాలను పక్కనపెట్టి ప్రజా సంక్షేమం కాకుండా కార్పొరేట్ సంక్షేమం కోసం కుట్ర చేస్తున్న నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది, లాభాలు బాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి ప్రైవేటీకరణ చేయాలని లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. రైల్వే, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, ఓడరేవులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, గ్యాస్ ఆయిల్ కంపెనీలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు పరిపాలన సాగిస్తున్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగుల భర్తీ చేస్తామని చెప్పిన హామీ అమలు కాలేదు విదేశాల్లో దాగిన కోట్లాది నల్లధనాన్ని తీసుకురావడంలో వైఫల్యం చెంది మతోన్మాద రాజకీయాల లబ్ధి పొందేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. భారత రాజ్యాంగంలోనే ప్రజాస్వామ్యం, లౌకిక అనే పదాలను తొలగించి మను ధర్మ శాస్త్రం అమలు కోసం మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రల వల్ల యువత అప్రమత్తంగా ఉండడంతో పాటు విద్య ఉద్యోగం, ఉపాధి, ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం మతస్మరస్యాన్ని కాపాడుకుంటూ ఉద్యమించినప్పుడే అమరవీరులకు నిజమైన నివాళులర్పించడం జరుగుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో నంది వాహన రెడ్డి, గుడిసె ఈరన్న, రాముడు, వీరేష్, రాఘవేంద్ర, గణేష్, నీలకంఠ, ఎస్సీ వీరేష్, లింగమయ్య, గ్రామ రైతులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

మాదిగల పైన దాడి చేసిన పురుషోత్తం రెడ్డిని వెంటనే రిమాండ్ కు పంపా

ఘనంగా 93వ భగత్ సింగ్ వర్ధంతి. ~ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్