in ,

మాదిగల పైన దాడి చేసిన పురుషోత్తం రెడ్డిని వెంటనే రిమాండ్ కు పంపా

మాదిగల పైన దాడి చేసిన పురుషోత్తం రెడ్డిని వెంటనే రిమాండ్ కు పంపాలి. ~ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, బి.ఎస్.పి, మాల మహానాడు,

*వైసిపి అండ చూసుకొని మాదిగల పైన దాడి చేసిన పురుషోత్తం రెడ్డిని వెంటనే రిమాండ్ కు పంపాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పి మనోజ్  బండారి గిడ్డయ్య మాదిగ హెబటం రాజు మాదిగ డిమాండ్*

ఆదోని మండలం నాగనాథ్ హళ్లి గ్రామానికి చెందిన జయం అనే వ్యక్తిని ఆదోని ఏరియా హాస్పిటల్ లో ఎమ్మార్పీఎస్ నాయకులు పరామర్శించి విషయం తెలుసుకోవడం జరిగింది.ఇంటిముందు తిరుగులాడే విషయంలో  సమస్య ఉండేది  ఎవరు లేనిది చూసి పురుషోత్తం రెడ్డి మేము ఉండే చోట మీరు ఉండకూడదని నా చీర పట్టి లాగి కొట్టాడు నేను గట్టిగా ఏడుస్తుంటే గట్టిగా అదురుతావా మాదిగ లంజా  నిన్ను చంపుతానని వాళ్ళ ఇంట్లో నుంచి ఒక రాడ్ తెచ్చి నా తలపై కొట్టాడు అని మాకు తెలిపింది తెలుసుకొని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు జై భీమ్ సాయిరాం, ఎమ్మెస్పి జిల్లా నాయకులు పిఎస్ వీరేష్, ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు గుమ్మల బాలస్వామి మాదిగ మాట్లాడుతూ………… వైసిపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి మాదిగల పైన  దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయంటే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు అయిన తర్వాత 41 నోటీసులు ఇచ్చి బేల్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దాడికి గురైన వారి పైన కౌంటర్ కేసు కడుతున్నారు. కౌంటర్ కేసు కడితే ముద్దాయిలు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి డిపార్ట్మెంట్ వారు పూర్తి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము వైసిపి పురుషోత్తం రెడ్డిని వెంటనే  తరలించకపోతే ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకుపోయి రాస్తారోకులు నిరాహార దీక్షలు చేపడతామని డిమాండ్. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టౌన్ నాయకుడు టి ఈరన్న మాదిగ, ఎం ఎస్ పి జిల్లా నాయకులు హుసేనప్ప, అంజినప్ప తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

ఫిబ్రవరి 28న ఉమ్మడి కర్నూలు జిల్లాల సమావేశాన్ని విజయవంతం చేద్దాం

నేడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతి