in ,

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

*జాతీయ జెండా ఎగురవేసిన మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి

ఆదోని న్యూస్ :- ఆదోని పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నందు 75 వ భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బోయ శాంత, అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్ రాధాకృష్ణ, డిఈ నాగభూషణం, డిఈ వెంకట చలపతి, ఏఈ రాజశేఖర్ రెడ్డి, ఏఈ కృపాకర్, ఆధ్వర్యంలో జాతీయ జెండాను మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎగురవేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ… గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. ఆదోని నియోజకవర్గ ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు హక్కుల కోసం పాటుపడాలన్నారు. స్వాతంత్ర్యం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారన్నారు. గణతంత్ర దినోత్సవం దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చాక ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఉండాలని పెద్దలు భావించారు. దీంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఆ కమిటీ రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కృషిచేసి రాజ్యాంగాన్ని రూపొందించిందన్నారు. అది 1930 జనవరి 26న అమల్లోకి తీసుకొని రావడంతో దాన్ని రిపబ్లిక్ నేషన్ గా పరిగణిస్తున్నారన్నారు. అప్పటినుంచి ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ శ్రీనివాసులు, సచివాలయం సెక్రెటరీలు, సచివాలయ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, అంగన్వాడి ఉపాధ్యాయులు, ఆయాలు, మున్సిపాలిటీ సిబ్బంది, క్లోరిన్ వాటర్ టెస్టింగ్ మున్సిపాలిటీ సిబ్బంది ఎం. చంద్రశేఖర్, మున్సిపాలిటీ వాటర్ ట్యాప్ ఇన్స్పెక్టర్ ఈరన్న, ఫిటర్స్ మల్లికార్జున, రామాంజనేయులు, ఈరన్న, తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం నిర్వహించుకున్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

నారాయణ డీజిఎంకి పిడిఎస్ఓ (PDSO )విద్యార్థుల సెగ

చాగి గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు…