*హనవాళ్ గ్రామంలో రోడ్లపై, ఇళ్ళ ముందు నిలిచిపోయిన మురుగునీరు* డ్రైనేజీలను క్లీన్ చేయని స్థానిక పంచాయతీ సిబ్బంది
ఆదోని మండలం హనవాళ్ గ్రామంలో డ్రైనేజీలు నిండిపోయి ఎక్కడికక్కడ డ్రైనేజీ నీళ్లు రోడ్లపైన, మరియు ఇళ్ళ ముందర నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుందని, డ్రైనేజీలను పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నదని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి కే లింగన్న, మండల నాయకులు భాషా, శాఖ కార్యదర్శి దస్తగిరి భాషా, విమర్శించారు.ఈ దినం గ్రామంలోని ఒకటో వార్డు (పింజరి బందె నవాజ్ ఇంటి ముందు) మరియు పీర్ల మసీదు ఏరియాలో ఈ పరిస్థితి ఉందని వారు తెలిపారు. ఇక్కడ డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారా అని స్థానికులను అడిగితే ఎవరు పట్టించుకోవడంలేదని తెలిపారని వారన్నారు. ఇప్పటికైనా స్థానిక పంచాయతీ అధికారులు తక్షణమే సీసీ డ్రైనేజీలను క్లీన్ చేయించి, రోడ్లపై నిలిచిపోయిన మురుగు నీటిని తొలగించి ప్రజలను, దోమలు మరియు రోగాల భారం నుంచి కాపాడాలని వారు కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున సచివాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.
This post was created with our nice and easy submission form. Create your post!