బాల్య వివాహాలను అరికట్టాలి
పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో మంగళవారం ప్రిన్సిపాల్ మాచాని కవిత ఆధ్వర్యంలో నవ యూత్ సభ్యులు బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నవయుత్ సభ్యులు వీరేష్ మాట్లాడుతూ………బాల్య వివాహాలు చేయడం వల్ల బాలికలు విద్యకు దూరమవటoతోపాటు, అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు చిన్నవయసులోనే బాలికలకు పెళ్లిళ్లు చేయకుండా బాలికల విద్యను ప్రోత్సహించాలని చాలని తెలిపారు. అలాగే బాల కార్మికులను గుర్తించి వారిని బడుల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిసిన తెలిసిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!