in ,

వలసలు నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం.

🔹 *వలసలు నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం…!*

🔹 *కాంగ్రెస్ పార్టీ ఆలూరు అసెంబ్లీ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ..*

👉 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారి పిలుపుమేరకు కర్నూలు జిల్లా అధ్యక్షులు కే. బాబు రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఆలూరు మండల అధ్యక్షులు తుంబలబిడు లక్ష్మన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి *కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఆలూరు అసెంబ్లీ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ గారు* హాజరయ్యారు.

👉 ఈ సందర్భంగా నాయకులతో  వారు మాట్లాడుతూ నియెాజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా, రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రిని చేసే దిశగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు.

👉 ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేనివిధంగా ఈ ఏడాది మొదటినుంచి వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారని. వర్షాలకు ఖరీఫ్ సీజన్ లో రైతులు పంటలు సాగు చేశారని వర్షాలు రాక ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అల్లాడుతున్నారని పంటలకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక హోలగుంద, ఆస్పరి, చిప్పగిరి, ఆలూరు మండలాలకు చెందిన రైతులు వలస బాట పట్టారని రాష్ట్ర ప్రభుత్వం వలసలు నివారించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తక్షణమే ఎకరాకు యాభై వేల రూపాయలు తక్షణ నష్ట పరిహారాన్ని అందించి కరువు మండలాలలో అదనపు ఉపాధి పనులు కల్పించి వలసలు నివారించాలని తెలిపారు.

త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండలాలలో పర్యటించి రైతుల దుస్థితి పై జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

👉 ఈ కార్యక్రమంలో ఆలూరు తాలూకా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం పల్లి రామాంజనేయులు, ఉపాధ్యక్షులు ఈరన్న, కరెంటు గోవిందు, ప్రధాన కార్యదర్శి వర కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు చిప్పగిరి వినోద్ కుమార్, ఎస్సీ సెల్ చిప్పగిరి మండల అధ్యక్షులు ఖాజీపురం రాంబాబు, మూర్తి, తుంబలబీడు గోవిందప్ప, రామాంజి పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

107వ రోజు* *గడప గడపకు మన ప్రభుత్వం.

వివోఏ ల సమస్యలు పరిష్కరిస్తూ వివోఏ లకు అన్ని విధాల అండగా ఉంటాం.