భాష్యం స్కూల్లో ఘనంగా దీపావళి వేడుకలు
————————————————
పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో శుక్రవారం ప్రిన్సిపాల్ మాచాని కవిత ఆధ్వర్యంలో ముందస్తు దీపావళి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేసి టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాచాని కవిత మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి అన్నారు. ఇంట్లోనే ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకువచ్చే గొప్ప పండుగ అని ఈ పండుగను హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు ఇతర మతస్తులు ఆరోగ్యము సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినిమే దీపావళి అని తెలిపారు. పాఠశాలలో అన్ని పండుగలు విశేషాలను,విశిష్టతను విద్యార్థులు తెలియచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!