in ,

ఎన్.రామయ్య ప్రాధమిక పాఠశాల భవనం అదనపు గదులు నిర్మించాలని వినతి.

*ఆదోని పట్టణంలో ని ఎన్. రామయ్య ప్రాధమిక పాఠశాల భవనం అదనపు గదులు నిర్మించాలి అని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతి*

*జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య గారికి వినతిపత్రాన్ని అందజేసిన బిడీఎస్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్*

ఆదోని పట్టణం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలనీనందు ఎన్. రామయ్య పురపాలక ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు నిధులు రాకపోవడంతో మధ్యలోనే నిలిచిపోయాయని.తక్షణమే నిధులు కేటాయించి పాఠశాలను అభివృద్ధి చేయాలని బి.డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు ఆర్ట్స్ కళాశాల నందు జరిగిన స్పందన కార్యక్రమంలో ఆదోనిలో జిల్లా జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బి.డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్ మాట్లాడుతూ గతంలో స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న భవనంలోఎన్. రామయ్య ప్రాధమిక పాఠశాల కొనసాగేదన్నారు.ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో పట్టణ శివారులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలనీలోని రేకులు షెడ్డు, ఓ ఇల్లు అద్దెకు తీసుకొని పాఠశాలను అక్కడికి మార్చారని తెలిపారు.. మూడేళ్లుగా విద్యార్థుల రేకుల షెడ్డులోనే విద్యను కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రసుత్తం ఈ పాఠశాలలో 106 మంది విద్యార్థులు చదువుతుండగా.. నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. గత ఏడాది నాడు నేడు రెండో విడత కింద రూ. 42 లక్షలు మంజూరు చేసిందని,ఇప్పటి వరకు రూ.8 లక్షలు విడుదల చేశారని తెలిపారు. ఆరు నెలలుగా నిధులు (రివాల్వింగ్ ఫండ్) రాకపోవడంతో భవన నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయన్నారు. విద్యార్థులకు రేకుల షెడ్డులొనే తరగతులు కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విద్యార్ధులందరిని ఒకే గదిలో విద్యను భోదించడం సరైనది కాదని,కావున తమరు విద్యార్థుల భవిష్యత్తు పై న్యాయంచేసే విధంగా ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించాలని, ఒక్కో తరగతికి ఒక్కో గదిని నిర్మించాడానికి కృషి చేయాలని బి.డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడలా రమేష్ సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వినతిపత్రాన్ని అందజేసారు.  విద్యా వ్యవస్థను నిర్వీర్యం కాకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కోరారు .వెంటనే ఆ పాఠశాలను సందర్శించి నిధులు కేటాయించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి డి ఎస్ ఎఫ్ పట్టణ నాయకులు సుభాష్, పవన్ కుమార్ ,వెంకటేష్ నాని ,జ్ఞానేశ్వర్ ,సాయి తదితర నాయకులు పాల్గొన్నారు..

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

కర్నూలు పశ్చిమ ప్రాంత సమస్యల పై ప్రత్యేక దృష్టి పెట్టండి.

పాలస్తీనా పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలి.