in ,

ఘనంగా మహాత్మా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

*ఎస్టీయూ ఆదోని డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు*

*గాంధీజీ కలల స్వరాజ్యాన్ని నిర్మిద్దాం…..ఎస్టీయూ*

*”జై జవాన్-జై కిసాన్” తో దేశ గతిని మార్చిన వ్యక్తి లాల్ బహుదూర్ శాస్త్రి… ఎస్టీయూ*      

స్థానిక ఆదోని  ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఎస్టీయూ నాయకులు మహాత్మా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పులహారాలు వేసి నివాళులుఅర్పించారు…. తదనంతరం ఎస్టీయూ నాయకులు  సి.నాగరాజు,వి.రమేష్ నాయుడు,నరసింహులు, సత్య,వీరచంద్ర యాదవ్,సుంకన్న మాట్లాడుతూ భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా నిర్మించడంలో గాంధీజీ పాత్ర అత్యంత ప్రాముఖ్యమైనదని, గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం ఏర్పడాలంటే ప్రతి భారతీయుడు తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించినప్పుడే అది సాధ్యమవుతుందని,భారతదేశం సకల వనరులకు ,సకల సంపదలకు మూలమని అటువంటి భారతదేశ సంపదను వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ ఒక క్రమ పద్ధతిలో భారతదేశానికి ఉపయోగపడేలా ప్రతి భారతీయుడు నడుచుకోవాలని ,హింసకు తావులేకుండా అహింసా మార్గంలో సత్యాగ్రహా ఆయుధంగా బ్రిటిష్  పాలకులను తరిమి కొట్టి అఖండ భారతావనికి స్వేచ్ఛ స్వాతంత్రం ప్రసాదించిన జాతిపిత  మహాత్మా గాంధీ గారి జీవితం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, సామాజిక మార్పుకోసం బాబూజీ అహర్నిశలు శ్రమించారని, గాంధీ చూపిన బాటలో నడవడానికి ప్రతిఒక్కరూ సహాయశక్తులుగా కృషిచేయాలని పేర్కొన్నారు.అదే విదంగా మాజీ ప్రధానమంత్రి ,స్వాతంత్ర సమరయోధులు,భారత రత్న లాల్ బహుదూర్  శాస్త్రి  స్వాతంత్ర పోరాటంలో పాల్గొని 9 సంవత్సరాలు జైల్ లో గడిపారని,నెహ్రు ప్రభుత్వంలో రైల్వే మంత్రి గా,1964 జూన్ 9 నుంచు 1966 జనవరి 11 వరకు ప్రధాన మంత్రి గా పనిచేశారని,1965 ఇండో..పాక్ యుద్ధ కాలంలో ‘”జై జవాన్..జై కిసాన్” నినాదం తో  దేశాన్ని ముందుకు నడిపారని,ఆ నినాదంతో ప్రజల్లో పేరు తెచ్చుకున్నారని,1965 తాస్కెంట్  ఒప్పందం కాలంలో మరణించారని తెలిపారు..ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు మహదేవప్ప, గోపాల్, హానుమన్న, రామంజి, జంబులయ్య, చిరంజీవి,రామ్మోహన్ రెడ్డి,శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

లంచాలు తిన్నోడి కోసం కాంచలు కొట్టారు వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి