in ,

ప్రజరోగ్య రక్ష జగనన్న సురక్ష గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి

గురు న్యూస్ విశాఖపట్నం : జగనన్న ఆరోగ్య సురక్ష అని, ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పదకుండా చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమాన్ని జగనన్న ఆరోగ్య సురక్ష’ ద్వారా చేపడుతున్నామని గాజువాక శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా రోగులను పలుకరించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కరపత్రాలను, ఫోల్డబుల్ కిట్లను ఆవిష్కరించారు. సంధర్భంగా శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రివెంటివ్ కేర్ లో నూతన అధ్యాయం లిఖిస్తుందన్నారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుతో నూతన ఒరవడికి నాంది పలికామన్నారు. దేశంలో ఎవరూ, ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. సీఎం జగనన్న వైద్య ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు.ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నామన్నారు. ఆ ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా గుర్తించేలా సర్వే నిర్వహిస్తున్నాం. ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు చేసి వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తున్నట్లు వెల్లడించారు.రోగం నయం అయ్యే దాకా సంబంధిత వ్యక్తిని చేయిపట్టి నడిపిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ ఆరోగ్య ఆసరాపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ ఇన్చార్జి తిప్పల దేవన్ రెడ్డి గారు మరయు స్థానిక ప్రజాప్రతినిధులు, రజనా రామరావు,లతీష్, ఊరుకుటి చందు,బి.న్.పాత్రుడు, ఇమ్రాన్,ఇళ్లపు ప్రసాద్, పల్ల చిన్న తల్లి,సన్నీ,కోమటి శ్రీను,ధర్మాల శ్రీనివాసరావు, రాజానా వెంకట రావు గారు, గౌస్, బోడ్డ గోవింద్, యువ శ్రీ, రోజా రాణి, మరయు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Balakishan

క‌ళాకారుల గుర్తింపు కార్డుల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వ‌నం

గ్రామపచాయతీ ప్రారంభం