in ,

ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అదీప్ రాజ్

 గురు న్యూస్ విశాఖపట్నం : పెందుర్తి నియోజకవర్గం 96 వ వార్డు ఏకలవ్య కాలనీ, గొర్లి వారి కాలనీ లో మంచినీటి పైపు లైన్లు శంకుస్థాపన జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదీప్ రాజ్ హాజరయ్యారు.. ముందుగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుంచి ఈ ప్రాంత ప్రజలు మంచినీరుకు ఇబ్బందులు పడుతున్నారని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కాలనీవాసులు తమ దృష్టికి తీసుకు వచ్చారని, వెంటనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటికి నిధులు కేటాయించి ఈరోజు శంకుస్థాపన చేశామని అయన తెలియజేశారు. నెల రోజుల్లో ప్రతి ఇంటికి మంచినీరు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు శాలువా తో ఘనంగా సత్కరించి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.. 

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Balakishan

కరీంనగర్ పట్టణంలో రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలు

చంద్రబాబు గారు ప్రజల మనిషి సినీ డైరెక్టర్ రవిబాబు