in ,

బ్రిడ్జి మూసివేత తో ప్రయాణీకులు ఇక్కట్లు

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, కొవ్వూరు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ గోదావరి నదిపై నిర్మించిన రోడ్డు కం రైలు వంతెనపై నేటినుంచి నెల రోజుల పాటు (అక్టోబర్‌ 26 వరకు) రాకపోకలు నిలిపివేస్తూ జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు విడుదల చేసింది.   రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వెళ్లే వాహనాలకు సుమారు పది కిలోమీటర్ల దూరం పెరగనుంది. దీంతో ఆర్టీసీ బస్సు ఛార్జీ పెరగనున్నట్లు సమాచారం. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరుకు ప్రస్తుతం రూ.20 ఉండగా గామన్‌ వంతెనపై రాకపోకల నేపథ్యంలో ఒక స్టేజీ పెరగనున్న నేపథ్యంలో టిక్కెట్టుపై రూ.10 అదనంతో పాటు టోల్‌గేట్‌ ఉండటంతో దానికి సంబంధించి మరో రూ.10 అదనంతో మొత్తంగా రూ.40గా టిక్కెట్టు ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్టీసీ అధికారులెవరూ స్పందించకపోవడం గమనార్హం. వాటితో పాటు ఆటోలు, ఇతర వాహనాలకు ధరలను సైతం రూ.20 వరకు పెంచి నడపనున్నట్లు ప్రచారం సాగుతోంది. వాహనాల మళ్లింపు ఇలా..

రోడ్డు కం రైలు వంతెన మరమ్మతుల నేపథ్యంలో రాకపోకలు నిలిపివేస్తున్న నేపథ్యంలో నేటి నుంచి అటుగా వెళ్లే వాహనాలన్నింటినీ మళ్లింపు చేపట్టారు. ఇందులో భాగంగా కొవ్వూరు, ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపోల పల్లెవెలుగు బస్సులు గామన్‌ వంతెనపై నుంచి కాతేరు, కంబాలచెరువు మీదుగా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్సుకు వచ్చి వెళ్తాయి. తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు డిపోల పల్లెవెలుగు బస్సులు విజ్జేశ్వరం నుంచి బ్యారేజ్‌ మీదుగా బొబ్బర్లంక, ధవళేశ్వరం, రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ నుంచి కాంప్లెక్సుకు వచ్చి వెళ్తాయి. బ్యారేజీ రోడ్డుపై ఎలాంటి ఇతర భారీ వాహనాలకు అనుమతి లేదు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు బ్యారేజీ రోడ్డు, గామన్‌ వంతెనపై యథావిధిగా వెళ్లొచ్చు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

రేపు సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ పీవి సునీల్ కుమార్ అనకాపల్లి రాక

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు..