in , ,

విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యమెందుకు

అధికారులు,పాలకులు కలసి విద్యార్థుల భద్రతను గాలికొదిలేశారని ప్రగతి శీల యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ముసలి సతీష్  ఆరోపించారు..చర్ల  మండల కేంద్రంలో లక్మికాలనీలో ఉన్నా పోస్ట్ మెట్రిక్  అమ్మాయిల హాస్టల్లో తక్షణమే సీసీ కెమెరాలు,సెక్యూరిటి గార్డును నియమించాలని డిమాండ్ చేశారు.సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని కోరుతూ స్థానిక తహశీల్దార్, సిఐ ఎంపిడిఒలకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిల హాస్టల్లో గతంలో దొంగలు ప్రవేశించిన సందర్భాలు ఉన్నాయని  అయిన అధికారులు సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యకుండా నిర్లక్ష్యం వహించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సెక్యూరిటీ గార్డు లేక ఆకతాయిల వల్ల అమ్మాయిలకు ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు.అధికారులు ఇప్పటికైనా స్పందించి రక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిరిగిరి నరేష్, అరుణ,భవాని విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు..

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

ఏపీలోనే ఎందుకు: లోకేష్

సెల్ ఫోన్ గొడవ:తల్లి ఆత్మహత్య