in , ,

లింగాపురంపాడు లో పూజలు అందుకుంటున్న గణనాధుడు

గణపతి నవరాత్రులను పురస్కరించుకుని చర్ల మండలం లింగాపురంపాడు గ్రామం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా మండపంలో విగ్రహాదాత రామనబోయిన. దామోదరబాబు, వెంకటరమణ దంపతుల నర్సమ్మ అమ్మ గారి జ్ఞాపకర్థం సందర్బంగా సోమవారం మండపంలో గణనాథుడిని ప్రతిష్టించారు. మహా గణపతి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈ సందర్భంగా దంపతులు  మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో అనందంగా జీవించేలా చూడాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండేలా గణపయ్యను వేడుకున్నట్లు పేర్కొన్నారు. యూత్ సభ్యులు మా ట్లాడుతూ ప్రతిరోజు వర్గీల్ పండితులచే మహా గణపతి హోమం, నవగ్రహ హోమం, కుంకుమార్చన, మహాలక్ష్మీ హోమం, సుబ్రమణ్య హోమం, చండికాపారమేశ్వర హోమం, రుద్రాభిషేకం, లాంటి పూజలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు మహా మండపం వద్ద గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు ప్రసాదం కార్యక్రమం చేపడుతుమన్నారు. నవరాత్రులు పూజలందుకున్న గణనాధుడిని నిమజ్జనం అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. తొలి రోజున అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మహా గణనాథుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో  యూత్ సభ్యులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by K Sravan

బోనులో చిరుత

వైసీపీ నాయకురాలు పై దాడి చేసిన టీడీపీ జనసేన శ్రేణులు