విజయనగరం: తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజు(Ashok Gajapati Raju ) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ (Chandrababu illegal arrest) కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు తెలిసే జరిగిందని చెప్పారు. జగన్(Jagan) జైల్లో పెట్టినప్పుడు సాక్ష్యాల కోసం వెతకలేదన్నారు. అన్ని ఆధారాలు న్యాయస్థానానికి దొరికిన తర్వా జగన్ ఒక దొంగ అని 16 మాసాలు జైల్లో పెట్టారని చెప్పారు.ఏ ఆధారాలు లేకుండానే చంద్రబాబుని జైల్లో బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మిగిలిన టీడీపీ నేతలను కూడా జైల్లో పెట్టించాలని జగన్ చూస్తున్నారని అశోక్ గజపతిరాజు మండిపడ్డారు.
[zombify_post]
