[ad_1]
బాబు అరెస్ట్ తనను ఎంతగానో బాధించిందని, అయన అరెస్ట్ నేపథ్యంలో తాను తన ఇంట్లో వినాయక చవితి వేడుకలను కూడా జరుపుకోలేదని బండ్ల గణేష్ తెలిపారు. ఐటీ ఉద్యోగులు నెల రోజుల పాటు ఉద్యోగాలు మానేసి, సొంతూళ్లకు వెళ్లి ధర్నాల్లో పాల్గొనాలని బండ్ల గణేశ్ అన్నారు. హైదరాబాద్ లో పార్కుల ముందు, రోడ్లపై కాకుండా… సొంతూళ్లలో బొడ్రాయి ముందు కూర్చోని ధర్నాలు చేయాలని సూచించారు. చంద్రబాబు జాతీయ సంపద అని, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని , బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేసారు.


