రుషికొండలో జరుగుతున్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నిర్మాణ పనుల్ని వేగవంతం చేశారు. ఇప్పటికే విశాఖలోని రుషికొండ చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి విశాఖ బదిలీ కార్యక్రమంలో భాగంగానే ఇటీవల విశాఖపట్నం పోలీస్ కమీషనరేట్‌ను అడిషనల్ డీజీ కేడర్‌కు అప్‌గ్రేడ్ చేసి రవిశంకర్ అయ్యన్నార్‌ను సీపీగా నియమించారు. ఏపీ మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ అంశాల్లో కోర్టు తీర్పు పెండింగులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రికి ఎక్కడ్నించైనా పాలన సాగించే హక్కున్న నేపధ్యంలో త్వరలో విశాఖకు మకాం మార్చనున్నారు


