Harish Rao- అధికారంలోకి వచ్చేది ఉందా? ఇచ్చేది ఉందా? అనుకుంటూ బూటకపు హామీలు ఇస్తున్నారు. పైగా మీరు చెప్పిన గ్యారెంటీలు కూడా మా కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవే. మీది జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా? రాష్ట్రానికో మేనిఫెస్టో ఎందుకు? కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో ఇచ్చిన హామీలు అని ఎద్దేవా చేశారు, తెలంగాణ మంత్రి హరీశ్ రావు .కర్నాటకలో మీరు ఇట్లానే ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయలేక వంద రోజుల్లోనే ఆగం ఆగం అవుతున్నారు అని ఆయన అన్నారు.
తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ సభపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆ సభలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామలపై ఆయన విరుచుకుపడ్డారు. అలవికాని హామీలు, అబద్ధాల ఆరోపణలు, చరిత్ర వక్రీకరణలు.. కాంగ్రెస్ సభ సాంతం ఆత్మవంచన, పరనిందగా సాగిందని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీలు దేవుడెరుగు, అసలు కాంగ్రెస్ కు ఓట్లు పడతాయనే గ్యారంటే లేదు గాలికి పోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టుంది

