in

గొలుగొండ. ఏఎల్ పురం హైస్కూల్లో ఆటలపోటీలు ప్రారంభం

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం  ఏ ఎల్ పురం మేజర్ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో భాగంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా నర్సీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చిటికెలా భాస్కర్ నాయుడు,ఎంపీపీ మణికుమారి ముఖ్య అధితులుగా పాల్గొని ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల  విద్యార్థులలో దాగివున్న నైపుణ్యాలను బయటికి తీయటానికి, అలాగే శారీరకంగా మానసికంగా ఆరోగ్యపరంగా విద్యార్థులు, దృఢంగా ఉండటానికి  ఇలాంటి ఆటల పోటీలు  ఎంతో ఉపయోగపడతాయని, అందుకే  రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారనారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లోచల సుజాత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్.నాగభూషణం, పి.డి టీ.వీ రమణ, వివిధ పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by N.Chiranjeevi

పట్టణ ప్రాంతాల్లోని పురాతన దేవాలయాలను కూడా డిడిఎన్ స్కీములో చేర్చండి

రావులపాలెం నుంచి అరుణాచల గిరి ప్రదక్షణ ప్రత్యేక బస్