in ,

ఆటోను ఢీకొట్టిన లారీ.. ఏడుగురికి గాయాలు 

[zombify_post]

స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా జాతీయరహదారిపై బుధ వారం తెల్లవారుజామున కూరగాయలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను ఢీకొట్టిన లారీ.. ఏడుగురికి గాయాలు 

గజపతినగరం: స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా జాతీయరహదారిపై బుధ వారం తెల్లవారుజామున కూరగాయలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ సీహెచ్‌ గంగరాజ్‌ కఽథనం మే రకు.. మండలంలోని మరుపల్లి, దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామానికి చెందిన రైతులు వారు పండించిన కూరగాయలను గజపతినగరంలో మార్కెట్‌కు ఆటోలో తరలిస్తున్నారు.గజపతినగరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద విజయనగరం నుంచి పెదమానా పురం వైపు వెళ్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఏడుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో సామిరెడ్డి కన్నంనాయుడును విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి, బొద్దాల సుగు ణను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మిగిలిన సింహాచలం, గౌరమ్మ, పరదేశి, తరు పతమ్మ, లక్ష్మి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. సమాచారం మేర కు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ఖమ్మం జిల్లా మంత్రి హరీశ్ రావు పర్యటనపై భట్టి హాట్ కామెంట్స్

స్వచ్చ సర్వేక్షన్ గ్రామీన్ 2023, రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానోత్సవం