in , , ,

రేపు సీయం కేసీఆర్ చేతుల మీదుగా నిర్మ‌ల్ మెడిక‌ల్ కాలేజీ త‌ర‌గ‌తులు ప్రారంభం

indra karan reddy

రేపు సీయం కేసీఆర్ చేతుల మీదుగా నిర్మ‌ల్ మెడిక‌ల్ కాలేజీ త‌ర‌గ‌తులు ప్రారంభం

వ‌ర్చువ‌ల్ లో మెడిక‌ల్ కాలేజ్ త‌ర‌గ‌తులు

ఎన్టీఆర్ స్డేడియం నుంచి  దివ్యా గార్డెన్ వ‌ర‌కు ర్యాలీ

ర్యాలీలో పాల్గొని విజ‌య‌వంతం చేయండి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల (వ‌ర్చువ‌ల్ ప‌ద్ద‌తిలో) మీదుగా రేపు ( శుక్ర‌వారం – 15న) నిర్మల్ నూత‌న మెడిక‌ల్ కాలేజ్ లో  ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో ఉద‌యం 10 గంట‌ల‌కు ఎన్టీఆర్ స్టేడియం నుంచి దివ్యా గార్డెన్ వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హిస్తారు.

ఈ ర్యాలీలో స్థానిక స‌ర్పంచ్ లు, ఎంపీటీసీలు,  జ‌డ్పీటీసీలు, మున్సిప‌ల్ చైర్మ‌న్, కౌన్సిల‌ర్లు, వార్డు మెంబ‌ర్లు, ఇత‌ర  ప్ర‌జాప్ర‌తినిధులు, బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, వైద్య ఉద్యోగులు, సిబ్బంది ఇత‌ర శాఖల అధికారులు పాల్గొని, ఈ ర్యాలీని విజ‌య‌వంతం చేయ‌గ‌ల‌ర‌ని కోరుతున్నాం.

మెడికల్‌ కాలేజీల ఏర్పాటు ద్వారా స్పెషాలిటీ వైద్య సేవలు పేద ప్రజలకు చేరువ కావ‌డంతో పాటు  
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో డాక్టర్‌ కావడం ఒక కల. కానీ ఇప్పుడు జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో అవకాశాలు పెరగడమే కాదు.. ఉచితంగా ‘డాక్టర్‌’ పట్టా అందుకునే అవకాశం కలిగింది. కావున అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఈ ర్యాలీలో పాల్గొని స‌క్సెస్ చేయ‌గ‌ల‌రు.

మంత్రి గారి క్యాంప్ కార్యాల‌యం

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం….