in ,

రెండు నెలలుగా ముంపులోనే గండిపోశమ్మ ఆలయం

అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలో గోదావరి ఒడ్డునున్న గండిపోశమ్మ అమ్మవారి ఆలయాన్ని వరద నీరు వీడటం లేదు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుమారు రెండు నెలలుగా పోశమ్మగండి ముంపులోనే ఉంది.  గోదావరిలో వరద ప్రవాహం తగ్గుతూ, పెరుగుతుండటంతో అమ్మవారి ఆలయ దర్శనాలను సైతం ఆలయాధికారులు తాత్కాలికంగా aనిలిపివేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు పెరిగిన వరద ప్రవాహం బుధవారం సాయంత్రం నాటికి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అమ్మవారి ఆలయం సమీపంలోని దుకాణాలు వరద నీటిలోనే ఉన్నాయి. పోశమ్మగండి వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై వరద నీరు తగ్గకపోవడంతో దండంగి వైపునకు రాకపోకలు పూర్తిగా నిలిచాయి. ఒకరోజు పాపికొండల విహారయాత్రకు బోటు వెళ్లినా వరద ప్రవాహం నేపథ్యంలో మళ్లీ విహారయాత్ర నిలిచిపోయింది. సీతపల్లి వాగులో గోదావరి ప్రవాహం కొనసాగుతోంది.

[zombify_post]

Report

What do you think?

ఏపిపిఎస్సి చైర్మన్ గౌతం సావాంగ్ కొడుకు దౌర్జన్యం

నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు