in , , , ,

కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

  • సెప్టెంబరు 17 వ తేదిన హైదరాబాదు లో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.

  • – మాజి ఎమ్మెల్సి పోట్ల నాగేశ్వరరావు

హైదరాబాదు లో సెప్టెంబరు 17 వ తేదిన జరిగే కాంగ్రెస్ పార్టీ విజయభేరి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజి ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు అన్నారు.  బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో  డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్దసంఖ్యలో బహిరంగ సభకు తరలిరావాలని అన్నారు. ‌సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తరలించడానికి వాహనాల ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుండి సీనియర్ టిపిసిసి వైస్ ప్రెసిడెంట్, మాజి మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జన‌సమీకరణ చేయాలని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరన్న నాయక్, నాగుల వాసు, ఆలేటి మాణిక్యం, అక్కినపల్లి జానయ్య, కుందమళ్ల శేఖర్, నరేందర్ నాయడు,  బంధం నాని, కరుణాకర్ రెడ్డి, షేక్ గౌస్, పిడమర్తి నాగరాజు, విష్ణు, పంతం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు..

[zombify_post]

Report

What do you think?

Written by Narra Paramesh

రాజకీయ వేధింపు కేసులు సరికాదు: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర

కిష్టారం ఓసి బ్లాస్టింగ్ ఆపరేషన్స్ ను తనిఖీ చేసిన కొత్తగూడెం ఏరియా జీఎం