in , ,

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలసిన నంబూరి

హైదరాబాదులో యస్సి మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష అధ్యక్షతన జరిగిన బీజేపీ యస్సి మోర్చ మండల అధ్యక్షుల రాష్ట్ర స్థాయి సమ్మేళనం సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా, శాసన సభ్యులు ఈటెల రాజేందర్ గౌరవ అతిధిగా హాజరైనారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మండల అధ్యక్షులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో దళితులను మోసం చేసిన నాయకుడు ఎవరైనా వున్నారంటే అది కేసీఆర్ మాత్రమే… దళితుల అభ్యున్నతికి పాటుపడింది మోడీ ప్రభుత్వమే అని కేంద్ర మంత్రి వర్గంలో 12 మంది దళితులను మంత్రులుగా చేసిన ఘనత మోడీదని ఈ దేశానికి రాష్ట్ర పతిని చేసింది. అంబేత్కర్ గారికి భారత రత్న ఇచ్చి పార్లమెంట్ లొ అంబేత్కర్ విగ్రహం ఏర్పాటు చేసి దళితుల ఆత్మగౌరవం కాపాడింది మోడీ ప్రభుత్వమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, మనోహర్ రెడ్డి, యస్ కుమార్, విజయరామారావు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ఆధారాలు ఉంటే లోకేష్ నైనా అరెస్టు చేస్తాం: హోంమంత్రి వనిత

చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ముందు అందరూ సమానులే : బడుగు