in , ,

మీకోసం మేమున్నాం సంస్థ | 2006-07 SSC బ్యాచ్ ఆర్థిక వితరణ

చర్ల విజయకాలనీ కి చెందిన బట్ట మంగవేణి భర్త శ్రీరాములు లేటు  ఇద్దరు కుమార్తెలు… పెద్దమ్మాయి భారతి చిన్నతనంలో హై ఫీవర్ రావడంతో  చెవులుకు ఇన్ఫెక్షన్ వచ్చి వినపడడం లేదు… ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా ట్రీట్మెంట్ ఖర్చులకు.. మీకోసం మేమున్నాం టీం ను ఆశ్రయించడం జరిగింది…పలువురి దాతల సహకారంతో  14,000/- రూపాయలు మంగళవారం చర్ల లోని మేమున్నాం కార్యాలయంలో,వారి కుటుంబ సభ్యులకు చింతలపూడి రామకృష్ణ చేతుల మీదుగా అందివ్వడం జరిగింది…. అలాగే బట్ట భారతి యొక్క చిన్ననాటి ఓల్డ్ స్టూడెంట్స్  2006-07 టెన్త్ బ్యాచ్ మిత్రబృందం వారు కూడా 10,000/-రూపాయలు ఆర్థికంగా మిత్రురాలికి అందజేయడం జరిగింది…ఈ కార్యక్రమంలో సాయిల నరేష్ యాదవ్, దొడ్డి సూరిబాబు, చిర్రా శ్రీనివాసరావు, తాండవ రాయుడు, దొడ్డ ప్రభుదాస్, బోల్ల వినోద్, ఆలం ఈశ్వర్, కవ్వాల రాము, ఎర్రమిల్లి కిరణ్, మురళీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు..

[zombify_post]

Report

What do you think?

Written by K Sravan

రేపు చింతలపూడిలో స్పందన కార్యక్రమం

పనులు బందు చేసి ఆందోళన నిర్వహిస్తాం”